అందుబాటులోకి కోవిడ్ 19 కాంటాక్ట్ ట్రేసింగ్ సిస్టం
- July 03, 2021
అబుధాబి: కోవిడ్ పాజిటీవ్ పేషెంట్లను గుర్తింపు, పాజిటీవ్ పేషెంట్లతో కాంటాక్ట్ లో ఉన్నవారిని ఏకకాలంలో ట్రేస్ చేసేందుకు అబుధాబి ఆరోగ్య శాఖ కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూనిక్ కాంటాక్ట్ ట్రేసింగ్ సిస్టం వ్యవస్థ సమాజంలో COVID-19 వ్యాప్తిని పర్యవేక్షించడానికి, అంచనా వేయడానికి, నియంత్రణ ప్రయత్నాలను బలోపేతం దోహదపడుతుందని ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. ఆన్ లైన్ చాట్ ద్వారా పాజిటీవ్ పేషంట్ల సమాచారాన్ని ట్రేసింగ్ సిస్టంలో పొందుపర్చవచ్చు. అరబిక్, ఇంగ్లీష్ భాషాల్లో వినియోగదారులు చాట్ కొనసాగించవచ్చు. పాజిటీవ్ గా నిర్ధారణ అయిన వ్యక్తికి వర్చువల్ చాట్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా ఎస్ఎంఎస్ వస్తుంది. వర్చువల్ చాట్ ను డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత పాజిటీవ్ వచ్చే సమయానికి 48 గంటల ముందు తాను ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారో వివరాలను కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. దీంతో రోగి లక్షణాలు, అతను ఎవరితో సన్నిహితంగా ఉన్నాడు, ఎక్కడెక్కికి ప్రయాణం చేశాడనే డేటా ఆరోగ్య శాఖకు అందుబాటులోకి వస్తుంది. దీంతో వైరస్ వ్యాప్తి నియంత్రణకు తాము చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వ వర్గాలకు ఓ స్పష్టత ఏర్పడుతుంది. అలాగే కమ్యూనిటీలో వ్యాప్తి తీవ్రతను అంచనా వేసేందుకు వీలుంటుంది.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..