అక్రమంగా మసాజ్ సెంటర్..నలుగురు మహిళల అరెస్ట్

- July 03, 2021 , by Maagulf
అక్రమంగా మసాజ్ సెంటర్..నలుగురు మహిళల అరెస్ట్

బహ్రెయిన్: అక్రమంగా మసాజ్ సెంటర్ ను నిర్వహించటమే కాకుండా కోవిడ్ నిబంధనలను బ్రేక్ చేసినందుకు నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు మహిళలతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తూ ఇల్లీగల్ యాక్టివిటీస్ కు పాల్పడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా రైడింగ్ చేసినట్లు మనామా పోలీసులు వెల్లడించారు. తమకు అందిన సమాచారం నిజమేనని నిర్ధారించుకున్న తర్వాత నలుగురు మహిళలను అరెస్ట్ చేశామని..అరెస్టైన వారిలో ఇద్దరు అసియా, ఇద్దరు అఫ్రికా మహిళలు ఉన్నట్లు తెలిపారు. అక్రమంగా మసాజ్ సెంటర్ నిర్వహించటమే కాకుండా కోవిడ్ నిబంధనలు అన్నింటిని బ్రేక్ చేశారని వెల్లడించారు. ఇదిలాఉంటే నార్తర్న్ గవర్నరేట్లో ఓ సెలూన్ లో కోవిడ్ నిబంధనలు పాటించటం లేదని పారిశ్రామిక మంత్రిత్వ శాఖ సిబ్బంది, పర్యాటక శాఖ సిబ్బంది గుర్తించి సెలూన్ ను మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com