1.7 కిలోల కొకైన్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- July 03, 2021
రియాద్: 1.7 కిలోల కొకైన్ స్మగ్లింగ్ గుట్టు రట్టయ్యింది. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేశారు కస్టమ్స్ అధికారులు. జకత్, ట్యాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ, ఈ స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేసింది. ఓ పార్సిల్ ద్వారా పెద్ద మొత్తంలో కొకైన్, సౌదీ అరేబియాలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరిగింది. ఎక్స్‌రే యంత్రాల ద్వారా పార్సిళ్ళను తనిఖీ చేస్తుండగా ఈ కొకైన్ పట్టుబడింది. పార్సిల్ ఎవరైతే అందుకోవాల్సి వుందో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. స్మగ్లింగ్ సంబంధిత సమాచారం ఎవరికైనా తెలిస్తే, 1910 నెంబర్ లేదా ఇ-మెయిల్ zatca.gov.sa@1910 లేదా 00966114208417 నెంబర్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చునని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







