ఔట్ డోర్ వర్క్ బ్యాన్ అమలుపై నిఘాకు ప్రత్యేక బృందాలు
- July 04, 2021
బహ్రెయిన్: వేసవిలో పగటి పూట బహిరంగ ప్రాంతాల్లో పని నిషేధం అమలుపై నిఘా వేసేందుకు జాతీయ మానవ హక్కుల సంస్థ-NIHR ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. కార్మిక చట్టాల మేరకు వేసవి కాలం జులై, ఆగస్టు మాసాల్లో మధ్యాహ్నాం 12 గంటల నుంచి 4 గంటల వరకు కార్మికులతో ఎండ తగిలే ప్రాంతాల్లో పనులు పురమాయించొద్దు. ఈ మేరకు ప్రతి ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా వేసవిలో ఔట్ డోర్ వర్క్ బ్యాన్ ను అమలు చేస్తున్నట్లు కార్మిక శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..మంత్రిత్వ శాఖ ఆదేశాలు పకడ్బందీగా అమలు చేస్తున్నారా..లేదా పర్యవేక్షించేందుకు NIHR వరుసగా మూడో ఏడాది కూడా బృందాలను ఏర్పాటు చేసింది. ఎవరైనా వర్క్ బ్యాన్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఫోటో తీసి ఫిర్యాదు చేయవచ్చాని NIHR పేర్కొంది. లేదా ఉల్లంఘన జరిగిన ప్రాంతం, సమయం వంటి వివరాలతో NIHR వాట్సాప్ నెంబర్ 17111666కు ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. లేదంటే NIHR హాట్ లైన్ నెంబర్ 8000114 కి ఫోన్ చేసిగానీ, ఈ మెయిల్ [email protected] ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







