ఐవిఎఫ్‌, ఫెర్టిలిటీ ల్యాబ్‌ ప్రారంభించిన అల్‌ అహిల్‌ ఆసుపత్రి

- March 09, 2016 , by Maagulf
ఐవిఎఫ్‌, ఫెర్టిలిటీ ల్యాబ్‌ ప్రారంభించిన అల్‌ అహిల్‌ ఆసుపత్రి

అల్‌ అహిల్‌ ఆసుపత్రి ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవిఎఫ్‌) మరియు ఫెర్టిలిటీ ల్యాబ్‌ని ప్రారంభించింది. అల్‌ అహిల్‌ హాస్పిటల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ బోర్డ్‌ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ తని బిన్‌ అబ్దుల్లా అల్‌ తని చేతుల మీదుగా ఈ ల్యాబ్‌ ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి మెడికేర్‌ గ్రూప్‌ క్యూఎస్‌సి మరియు అల్‌ అహిల్‌ ఆసుపత్రి సీఈఓ ఖాలిద్‌ మహమమ్మద్‌ అల్‌ ఇమాది, అల్‌ అహిల్‌ హాస్పిటల్‌ మెడికల్‌ డైరెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ హుస్సేన్‌ మరియు ఆసుపత్రికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఫెర్టిలిటీ మరియు జెనెటిక్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నబిల్‌ ఎం తరాజీ మాట్లాడుతూ, ఐవిఎఫ్‌ ట్రీట్‌మెంట్‌ ప్రొసీజర్‌ రెండు వారాలపాటు ఉంటుందని చెప్పారు. ట్రీట్‌మెంట్‌ కోసం పేషెంట్‌ని ప్రిపేర్‌ చేయడానికి వారం నుంచి 10 రోజుల సమయం పడ్తుందనీ, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌ కోసం మరో నాలుగు రోజులు పడ్తుందని ఆయన వివరించారు. 40 నుంచి 50 మంది పేషెంట్లు కన్సల్టేషన్‌ కోసం వస్తారని అంచనా వేస్తున్నామనీ, వారిలో 8 నుంచి 10 మందికి మాత్రమే రోజుకి ఆపరేషన్లు చేసేందుకు అవకాశముందనీ, భవిష్యత్తులో ఇంకా ఈ సౌకర్యాల్ని విస్తరిస్తామని చెప్పారాయన. పొరుగు దేశాల్లో ఈ చికిత్స కోసం చాలా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందనీ, ఇక్కడ తాము 18000 ఖతారీ రియాల్స్‌ మాత్రమే ఛార్జ్‌ చేస్తామన్నారు. సుమారు 10 నుంచి 15 శాతం వరకు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారనీ, అయితే అందరికీ ఐవిఎఫ్‌ చికిత్స అవసరం ఉండదనీ, ఇది ఒక ఆప్షన్‌ మాత్రమేనని అన్నారు. ఐవిఎఫ్‌లో 40 నుంచి 45 శాతం సక్సెస్‌ రేట్‌ ఉంటుందన్నారు. సక్సెస్‌ రేట్‌ని 60 నుంచి 65 శాతానికి పెంచేలా అధునాత పద్ధతులను అవలంబిస్తామని చెప్పారు నబిల్‌ ఎం తరాజి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com