షాపులపై పాక్షిక ఆంక్షల్లో అర్ధం లేదన్న కువైట్ ఎంపీ

- July 04, 2021 , by Maagulf
షాపులపై పాక్షిక ఆంక్షల్లో అర్ధం లేదన్న కువైట్ ఎంపీ

కువైట్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు కువైట్ కేబినెట్ అమలు చేస్తున్న నిర్ణయాలపై ఎంపీ అబ్దుల్ కరీం అల్ కందారీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ వైపు వ్యాక్సిన్ తీసుకున్నవారికి మాత్రమే షాపింగ్ కాంప్లెక్స్ లోకి అనుమతి అంటూ ఆంక్షలు విధిస్తూ మరోవైపు రాత్రి 8 గంటల నుంచి షాపులను, మాల్స్ ను మూసివేయాలన్న ఆదేశాల్లో అర్ధం లేదని అభిప్రాయపడ్డారు. కాంప్లెక్స్ లోకి వ్యాక్సిన్ తీసుకున్నవారిని మాత్రమే అనుమతిస్తే..ఇక షాపులను మూసివేయాల్సిన అవసరం ఏంటన్నది ఆయన లాజిక్. అంతేకాదు వ్యాక్సిన్ పొందిన వారి వివరాల్లోనూ గందరగోళం ఉందన్నారాయన. వ్యాక్సిన్ పొంది వైరస్ నుంచి రక్షణ ఉందని భావిస్తున్నవారిని మాత్రమే కాంప్లెక్స్ లోకి అనుమతించాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లైతే రాత్రివేళల్లో కాంప్లెక్స్ లను మూసివేయాలన్న పాక్షిక అంక్షలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ అభిప్రాయపడ్డారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com