అబుధాబి బిగ్ టికెట్ డ్రా లో జాక్‌పాట్ కొట్టిన భారతీయ డ్రైవర్
- July 04, 2021
యూఏఈ: దుబాయ్ లో ఉంటున్న కేరళలోని కొల్లాం జిల్లా కు చెందిన భారతీయ డ్రైవర్ రెంజిత్ సోమరాజన్‌కు జాక్‌పాట్ తగిలింది.అబుధాబిలో నిర్వహించే ‘బిగ్ టిక్కెట్’ లాటరీలో ఆయన ఏకంగా 20 మిలియన్ దిర్హామ్స్ (సుమారు రూ.405,752,634) గెలచుకున్నారు.ఈ మేరకు లాటరీ విజేతను శనివారం ప్రకటించారు. ‘బిగ్ టిక్కెట్’ తమ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా కూడా విజేతకు శుభాకాంక్షలు తెలిపింది.
వివరాల్లోకి వెళ్తే... కేరళలోని కొల్లాం జిల్లా కు చెందిన భారతీయ డ్రైవర్ రెంజిత్ సోమరాజన్
దుబాయ్‌లో 2008 నుంచి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు.జూన్ 29న తన తొమ్మిది మంది స్నేహితులతో కలిసి సోమరాజన్ కొన్న లాటరీ టికెట్‌కు ఈ జాక్‌పాట్ తగిలింది.దాంతో తాను గెలుచుకున్న ప్రైజ్‌మనీని మిగతా తొమ్మిది మందితో పంచుకోనున్నట్లు ఈ సందర్భంగా సోమరాజన్ తెలిపారు.
శనివారం డ్రా కార్యక్రమాన్ని తన ఎనిమిదేళ్ల కుమారుడు ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించడం, తాను కొనుగోలు చేసిన టికెట్ నెం.349886కు లాటరీ తగలడం అంత చకచక జరిగిపోయాయని చెప్పుకొచ్చారు.దీంతో తమ ఆనందానికి అవధుల్లేవన్నారు.గత మూడేళ్లుగా అబుధాబి బిగ్ టికెట్‌లో తాము 10 మంది కలిసి లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నామని, ఇన్నాళ్లకు తమ కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ నగదుతో తాను సొంత బిజినెస్ ప్రారంభించనున్నట్లు సోమరాజన్ చెప్పారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







