18 ఏళ్ల వారికి కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ షురూ

- July 04, 2021 , by Maagulf
18 ఏళ్ల వారికి కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ షురూ

ఒమన్: కమ్యూనిటీ ఇమ్యూనిటీ పెంచటమే లక్ష్యంగా చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రయను మరింత ముమ్మరం చేసింది ఒమన్. ఇందులో భాగంగా 18 ఏళ్లు, అంతకుపైబడిన వయసు వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రారంభించింది. ఇవాళ్టి నుంచే ( జులై 4-ఆదివారం) 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు.అయితే..వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకుంటున్న వారు స్వచ్ఛదంగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.తారసుద్ యాప్ ద్వారాగానీ https://covid19.moh.gov.om/#/home లింక్ ద్వారాగానీ ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే సుల్తానేట్లోని పలు గవర్నరేట్లలో ఉన్న ఇమ్యూనేషన్ కేంద్రాలకు వెళ్లాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. ఒమన్ కోవిడ్ లైవ్ వెబ్ సైట్ లో పొందుపర్చిన వివరాల మేరకు ఇప్పటివరకు సుల్తానేట్లో 11,81,953 డోసుల మేర వ్యాక్సిన్ పంపిణీ చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com