ఫిలిప్పీన్స్‌లో కూలిన సైనిక విమానం...17 మంది మృతి

- July 04, 2021 , by Maagulf
ఫిలిప్పీన్స్‌లో కూలిన సైనిక విమానం...17 మంది మృతి

మనీలా: ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 92 మంది ప్రయాణీకులతో వెళ్తున్న మిలటరీ విమానం ఆదివారం దక్షిణ ఫిలిప్పీన్స్‌లో కూలిపోయిందని ఆర్మీ చీఫ్‌ తెలిపారు.ఈ ఘటనలో మొత్తం 17 మంది చనిపోయారని మీడియా కథనాలు వెలువడుతున్నాయి.ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సి-130 విమానం కూలిన వెంటనే మంటలు అలుముకున్నాయని, దీని నుండి 40 మందిని రక్షించామని ఆర్మీ జనరల్‌ సిరిలిటో సోబెజానా తెలిపారు.సులు ప్రావిన్స్‌లోని జోలో ఐలాండ్‌లో విమానం దిగుతుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.సహాయక సిబ్బంది...సహాయ చర్యలు చేపడుతున్నారని, మరి కొంత మందిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రయాణీకుల్లో ఎక్కువ మంది ప్రాథమిక మిలటరీ ట్రైనింగ్‌ పూర్తి చేశారని, ఉగ్రవాదంపై పోరాడే ఉమ్మడి టాస్క్‌ పోర్స్‌లో భాగంగా వారిని ఆ ఐలాండ్‌లో మోహరించేందుకు తీసుకెళుతున్నారని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com