ఢిల్లీ అంతర్జాతీయ పోస్టాఫీసులో భారీగా డ్రగ్స్‌ పట్టివేత..

- July 04, 2021 , by Maagulf
ఢిల్లీ అంతర్జాతీయ పోస్టాఫీసులో భారీగా డ్రగ్స్‌ పట్టివేత..

న్యూఢిల్లీ: ఢిల్లీ అంతర్జాతీయ పోస్టాఫీసులో భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. విమాన మార్గాల ద్వారా వస్తే పట్టుబడతామనే ఉద్దేశం తో స్మగ్లర్లు కొత్త పద్ధతులను అవలంభిస్తున్నారు.కానీ స్మగ్లర్ల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ కస్టమ్స్‌ అధికారులు చెక్‌ పెడుతున్నారు.
ఆఫ్రికా నుండి ఢిల్లీ లోని గుర్‌గావ్‌ అడ్రస్‌ కు ఓ పార్సిల్‌ లో రూ.7.4 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ డ్రగ్స్‌ వచ్చినట్లు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు.పార్సిల్‌ అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు సోదా చేశారు.పార్సిల్‌ ను అత్యాధునిక పరికరాలతో స్కానింగ్‌ చేయగా అందులో నిషేధిత డ్రగ్స్‌ ఉన్నట్లు తెలిసింది.చేతికి వేసుకునే గాజులలో డ్రగ్స్‌ ను నింపి ఏమాత్రం అధికారులకు అనుమానం రాకుండా స్మగ్లర్లు తెలివిగా పార్శిల్‌ చేశారు.కానీ అత్యాధునిక పరికరాలతో తనిఖీలు చేసిన కస్టమ్స్‌ అధికారులు, ఢిల్లీ పోస్టాఫీసులో స్మగ్లర్ల డ్రగ్స్‌ గుట్టును రట్టు చేశారు.ఆఫ్రికా అడ్రస్‌ లో ఎవరు ఉంటున్నారు? గుర్‌గావ్‌ అడ్రస్‌ లో ఎవరికి ఈ పార్శిల్‌ వచ్చింది అనే సమాచారం పై కస్టమ్స్‌ అధికారులు విచారణ చేపట్టారు.దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com