ఆగస్ట్ 31 వరకు కోవిడ్ సెఫ్టీ ప్రోటోకాల్ పొడిగింపు

- July 05, 2021 , by Maagulf
ఆగస్ట్ 31 వరకు కోవిడ్ సెఫ్టీ ప్రోటోకాల్ పొడిగింపు

యూఏఈ: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు చేపడుతున్న కోవిడ్ నిబంధనలను ఆగస్ట్ 31 వరకు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు రస్ అల్ ఖైమా వెల్లడించింది. వచ్చే నెలాఖరు వరకు ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాలే అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. పబ్లిక్ ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు, స్పోర్ట్స్, సంస్కృతిక కార్యక్రమాలు ఇతర ప్రభుత్వ అనుమతి పొందిన ఈవెంట్లకు హజరయ్యేవారు ఖచ్చితంగా వ్యాక్సిన్ పొంది ఉండాలని తెలిపింది. వ్యాక్సిన్ సర్టిఫికేషన్ తో పాటు ఈవెంట్ కు 48 గంటల్లోపు తీసుకున్న పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ ను అదనంగా చూపించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోకపోయినా, పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ లేకపోయినా ఈవెంట్లకు ప్రవేశం ఉండదని వెల్లడించింది. అల్ హోస్న్ యాప్ ద్వారా వ్యాక్సిన్ సర్టిఫికేషన్ ను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com