మూడ్రోజుల్లో 140 మంది కోవిడ్ పేషెంట్ల మృతి

- July 05, 2021 , by Maagulf
మూడ్రోజుల్లో 140 మంది కోవిడ్ పేషెంట్ల మృతి

ఒమన్: ఒమన్ లో కోవిడ్ మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ వస్తోంది. కేవలం మూడ్రోజుల్లోనే 140 మంది కోవిడ్ తో మృతి చెందారు. జులై 1 నుంచి జులై 3 వరకు నమోదైన వివరాలు ఇవి. కోవిడ్ కేసుల వివరాలను తెలిపే తారస్సద్ యాప్ లో పొందుపర్చిన వివరాల మేరకు గత గురువారం 50 మంది, శుక్రవారం 48 మంది, శనివారం 45 మంది మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటివరకు కోవిడ్ మృతుల సంఖ్య 3,283 మందికి పెరిగింది. ఇదిలాఉంటే గడిచిన 24 గంటల్లో ఒమన్ వ్యాప్తంగా 171 మంది కోవిడ్ తో ఆస్పత్రుల్లో చేరారు. దీంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్ల సంఖ్య 1,589 మందికి పెరిగింది. ఇందులో 532 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com