ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు..

- July 05, 2021 , by Maagulf
ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు..

అమరావతి: ఏపీలో కరోనా కేసులు గత రెండు వారాల నుంచి తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేస్తూ..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ప్రస్తుత ఆంక్షలు ఈ నెల 7వ తేదీ వరకు అమల్లో ఉండనుండగా..అ తర్వాతి నుంచి కొత్త ఆంక్షలు అమలులోకి రానున్నాయి.ఈ కొత్త ఆంక్షల ప్రకారం…తూ.గో,ప.గో జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు ఉండనున్నాయి.

అలాగే…సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది ప్రభుత్వం. పాజిటివిటీ రేటు 5 లోపు వచ్చేంత వరకూ ఈ రెండు జిల్లాల్లో ఆంక్షల కొనసాగింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.మిగిలిన జిల్లాల్లో ఉదయం 6 గంటలనుంచి రాత్రి 10 గంటల వరకూ సడలింపులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.ఇక మిగతా జిల్లాల విషయానికి వస్తే…రాత్రి 9 గంటలకు దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com