డెలివరీ బాయ్స్ స్పెషల్ డ్రైవింగ్ కోర్సులు
- July 06, 2021
దుబాయ్: డెలివరీ బాయ్స్ కు ప్రత్యేకంగా డ్రైవింగ్ కోర్సులను ప్రారంభించింది దుబాయ్ ఆర్టీఏ. ఫుడ్ డెలివరీ, ఇతర వస్తువులను బైక్ పై డెలివరీ చేసేవారు సురక్షిత ప్రయాణ విధానాలను అవలంభించటంతో పాటు తోటి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా వ్యవహరించేలా డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం గుర్తింపు పొందిన డ్రైవింగ్ ఇన్ట్సిట్యూషన్ లతో ఆర్టీఏ కోఆర్టినేట్ చేస్తోంది. అర్హత కలిగిన శిక్షకుల ద్వారా డెలివరీ బాయ్స్ కి బైక్ రైడింగ్ లో శిక్షణ ఇస్తారు. ఈ మొత్తం వ్యవహారం ఆర్టీఏ పర్యవేక్షణలో జరుగుతుంది. డెలివరీ బాయ్స్ తమ సెఫ్టీ కోసం పాటించాల్సిన నిబంధనలు, ట్రాఫిక్ చట్టాలపై అవగాహన, రోడ్లపై పాటించాల్సిన ట్రాఫిక్ నిబంధనలతో పాటు ట్రాఫిక్ సమయాల్లో వ్యవహరించాల్సిన తీరు, ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రమాదాల బారినపడకుండా డ్రైవింగ్ మెళకువలు, ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వటం వంటి అంశాలతో డ్రైవింగ్ కోర్సు ఉంటుంది. పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో డెలివరీ బాయ్స్ కి డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నట్లు ఆర్టీఏ వెల్లడించింది. శిక్షణ పూర్తి అయిన తర్వాత వారి చివర్లో వారి నైపుణ్యాన్ని పరీక్షిస్తారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







