గల్ఫ్ ఎయిర్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

- July 06, 2021 , by Maagulf
గల్ఫ్ ఎయిర్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

కువైట్: గల్ఫ్ ఎయిర్ ఫ్లైట్ GF215కి తృటిలో ప్రమాదం తప్పింది. బహ్రెయిన్ నుంచి కువైట్ చేరుకున్న విమానం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో అనుకోకుండా సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే..ఎలాంటి సమస్య లేకుండా ఫ్లైట్ ల్యాండ్ అయినట్లు విమానయాన సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఫ్లైట్ లోని 62 మంది ప్రయాణికులు ఏడుగురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, వారిని ఎయిర్ పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ కు తరలించామని వెల్లడించారు. అయితే..ల్యాండింగ్ సమయంలో తలెత్తిన మైనర ఇన్సిడెంట్ కి సంబంధించి కారణాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారులతో కలిసి విచారిస్తున్నట్లు వివరించారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com