నెదర్లాండ్స్ పై బంగ్లాదేశ్ విజయం
- March 09, 2016
క్వాలిఫయంగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ పై విజయం సాధించింది. నిర్ణీత 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది.హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్ చివరి వరకు పోరాడి ఓడింది. తొలి నుంచి కూడా వికెట్లు తీయడంలో బంగ్లా బౌలర్లు సఫలం కావడంతో విజయం సులభమైంది. ఓ దశలో నెదర్లాండ్ 10 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. కానీ, బ్యాట్స్ మెన్స్ భాగస్వామ్యం నెలకొల్పడంలో విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. స్టెఫాన్ మైబర్గ్ 29, కెప్టెన్ పీటర్ బోరెన్ 29, బెన్ కూపర్ 20, టామ్ కూపర్ 15 పరుగులు చేసినా చివర్లో బౌలర్లు చేతులేత్తేశారు.
బంగ్లా బౌలర్లు అమిన్ హుస్సేన్ రెండు, షకిబుల్ హసన్ 2 వికెట్లు తీయగా, నాసిర్ హుస్సన్, మొర్తజా తలో వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసినా బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్ 15 పరుగులకే వెనుతిరిగినా... మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 58 బంతుల్లో 83 (3 సిక్సర్లు, 6 ఫోర్లు) పరుగులు చేసి నాట్ ఔట్‌గా నిలిచాడు. వరుస వికెట్లు కోల్పోతున్న ఇక్బాల్ ధీటుగా ఆడుతూ టీమ్ కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.నెదర్లాండ్స్ బౌలర్లు వేన్ డెర్ గుగ్టెన్ మూడు వికెట్లు, వాన్ మీకెరెన్ రెండు వికెట్లు తీయగా మెర్వీ, బోర్రెన్ తలో వికెట్ తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా తమీమ్ ఇక్బాల్ ఎంపికయ్యాడు. మరో మ్యాచ్ ధర్మశాలలో రాత్రి 7 గంటలకు ఐర్లాండ్, ఒమన్ ల మధ్య జరుగును.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







