అబుదాబీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
- March 09, 2016
అబుదాబీ నివాసితులు భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా వాహనదారులు అత్యంత జాగ్రత్తగా రోడ్లపై ప్రయాణించాల్సిందిగా అధికారులు హెచ్చరించారు. అత్యధికంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అలాగే 110 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అబుదాబీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, భారీ వర్షాలు ఈదుగారులలతో ఆస్తి నష్టం కలగజేస్తున్నాయని పేర్కొంది. రహదార్లపై విరిగిపడిన చెట్లతో డ్రైవింగ్ కండిషన్స్ ఇబ్బందిగా మారినట్లు మినిస్ట్రీ వెల్లడించింది. సోషల్ మీడియా ద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు పరిస్థితికి సంబంధించిన ఫొటోలు ఉంచుతున్నారు. వాటి ఆధారంగా రోడ్లపైకి వచ్చేవారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎయిర్పోర్ట్లో ఓ చోట ఈదురుగాలులకు పైకప్పు కూలిపోయినట్లుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో పట్ల ఖండన ప్రకటన చేసింది అబుదాబీ ఎయిర్పోర్ట్స్ సంస్థ. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని యూఏఈ అధికారిక వర్గాలు వెల్లడించాయి. విమాన సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు తొలుత ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత యధాతథంగా విమానాలు నడుస్తాయని ఇంకో ప్రకటన విడుదల చేశారు. అలాగే అబుదాబీ ఎడ్యుకేషన్ కౌన్సిల్, బుధవారం స్కూళ్ళను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. రేపు కూడా స్కూళ్ళు తెరవరు. యూఏఈ మాత్రమే కాకుండా గల్ఫ్ దేశాల్లో చాలావరకు ఇదే వాతావరణ పరిస్థితి నెలకొంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







