ఈ నెల 17వరకు బంగారు దుకాణాలు బంద్
- March 09, 2016
అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య (జెమ్స్ అండ్ జువెల్లర్స్ ఫెడరేషన్-జీజేఎఫ్) పిలుపు మేరకు పాతబస్తీలోని బంగారం వ్యాపారస్తుల బంద్ ఈనెల 17 వరకు కొనసాగనుంది. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన బంద్ మొదట్లో మూడు రోజుల వరకు మాత్రమేనని ప్రకటించారు.కాగా, కేంద్ర ప్రభుత్వం వీరి సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రాకపోవడంతో ఈ నెల 7వ తేదీ వరకు బంద్‌ను పొడిగించారు. అప్పటికీ... ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతో ఈ నెల 17వ తేదీ వరకు ఆందోళన కొనసాగించాలని జీజేఎఫ్ నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం కూడా పాతబస్తీలోని బంగారం వ్యాపారస్తులు బంద్ పాటించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఒక శాతం ఎక్సైజ్ సుంకం విధింపును పాతబస్తీ బంగారు ఆభరణాల వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







