యుఏఈలో గురువారం కూడా స్కూళ్ళకు సెలవు
- March 09, 2016
యుఏఈ వ్యాప్తంగా రేపు (గురువారం) ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళకు సెలవు ప్రకటించింది యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ హుస్సేన్ అల్ హమాదీ, గురువారం స్కూళ్ళకు సెలవు ప్రకటిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారనీ, ప్రభుత్వ స్కూళ్ళతోపాటు ప్రైవేటు స్కూళ్ళకూ ఈ సెలవు వర్తిస్తుందని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో యూఏఈ అంతటా ఇబ్బందికర పరిస్థితులు నెలకొనడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ కరికులమ్ స్కూల్స్ మరియు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ సెంటర్స్ వార్షిక పరీక్షలు (10 మరియు 12 గ్రేడ్స్‌కి) యధాతథంగా టైమ్ టేబుల్ ప్రకారం జరుగుతాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్‌కి గంట ముందుగా చేరుకోవలసి ఉంటుంది. పరీక్ష హాల్‌లోకి ఉదయం 8.15 గంటలకే చేరుకోవాలి. అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా 7.15 నిమిషాలకే రావడం మంచిదని ఇండియన్ హై స్కూల్ సీఈఓ అశోక్ కుమార్ చెప్పారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







