అబుదాబీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

- March 09, 2016 , by Maagulf
అబుదాబీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

అబుదాబీ నివాసితులు భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా వాహనదారులు అత్యంత జాగ్రత్తగా రోడ్లపై ప్రయాణించాల్సిందిగా అధికారులు హెచ్చరించారు. అత్యధికంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అలాగే 110 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అబుదాబీ మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, భారీ వర్షాలు ఈదుగారులలతో ఆస్తి నష్టం కలగజేస్తున్నాయని పేర్కొంది. రహదార్లపై విరిగిపడిన చెట్లతో డ్రైవింగ్‌ కండిషన్స్‌ ఇబ్బందిగా మారినట్లు మినిస్ట్రీ వెల్లడించింది. సోషల్‌ మీడియా ద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు పరిస్థితికి సంబంధించిన ఫొటోలు ఉంచుతున్నారు. వాటి ఆధారంగా రోడ్లపైకి వచ్చేవారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఓ చోట ఈదురుగాలులకు పైకప్పు కూలిపోయినట్లుగా సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న వీడియో పట్ల ఖండన ప్రకటన చేసింది అబుదాబీ ఎయిర్‌పోర్ట్స్‌ సంస్థ. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని యూఏఈ అధికారిక వర్గాలు వెల్లడించాయి. విమాన సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు తొలుత ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత యధాతథంగా విమానాలు నడుస్తాయని ఇంకో ప్రకటన విడుదల చేశారు. అలాగే అబుదాబీ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌, బుధవారం స్కూళ్ళను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. రేపు కూడా స్కూళ్ళు తెరవరు. యూఏఈ మాత్రమే కాకుండా గల్ఫ్‌ దేశాల్లో చాలావరకు ఇదే వాతావరణ పరిస్థితి నెలకొంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com