వైఎస్ఆర్‌కు నివాళులర్పించిన విజయమ్మ, షర్మిల
- July 08, 2021
కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేడు.ఈ సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళి అర్పించేందుకు ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు తరలివస్తున్నారు.ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల నివాళర్పించారు.వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.
వైఎస్సార్ కుమార్తె అయిన షర్మిల ఈరోజు తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. తన తండ్రికి నివాళులర్పించిన అనంతరం షర్మిల నేరుగా హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 5 గంటలకు వేలాది మంది వైఎస్సార్ అభిమానుల సమక్షంలో వైఎస్ షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు ఎజెండాను ప్రకటించనున్నారు.మరోవైపు వైఎస్ఆర్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మధ్యాహ్న సమయంలో ఇడుపులపాయకు చేరుకుని తండ్రికి నివాళులర్పించనున్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







