‘కిరాతక’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల
- July 08, 2021
హైదరాబాద్: ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా ఎం.వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం కిరాతక. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన కిరాతక టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ రోజు కిరాతక ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13నుండి ప్రారంభంకానుంది.
ఈ సందర్భంగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ – ”నేను ఇప్పటివరకు చాలా కథలు విన్నాను..కాని ఈ థ్రిల్లర్ కథ నాకు బాగా నచ్చింది.పెర్ఫామెన్స్కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్. అలాగే ఆదితో ఫస్ట్ టైమ్ నటిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది” అని అన్నారు.
దర్శకుడు ఎం.వీరభద్రమ్ మాట్లాడుతూ – ‘ప్రస్తుతం ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రంలో పూర్ణ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. అలాగే దాసరి అరుణ్ కుమార్, దేవ్‌గిల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఆది ఇంత వరకూ చూడని ఒక సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. కిరాతక కథ నచ్చి సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ సినిమాలో నటించడానికి పాయల్ రాజ్‌పుత్ ఒప్పుకుంది. ఆమె క్యారెక్టర్ కూడా ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది. భారీ బడ్జెట్‌తో విజన్ సినిమాస్ బ్యానర్లో నాగం తిరుపతి రెడ్డిగారు అన్కాంప్రమైజ్డ్గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు’ అన్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఆది సాయికుమార్, ఎం. వీరభద్రం కాంబినేషన్ లో ‘చుట్టాలబ్బాయి’ తర్వాత వస్తున్న రెండో సినిమా ‘కిరాతక’!
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







