ప్రభుత్వ అలాగే మినిస్ట్రీ సందర్శకుల కోసం కోవిడ్ 19 కొత్త నిబంధనలు

- July 08, 2021 , by Maagulf
ప్రభుత్వ అలాగే మినిస్ట్రీ సందర్శకుల కోసం కోవిడ్ 19 కొత్త నిబంధనలు

యూఏఈ: ఫెడరల్ గవర్నమెంట్ డిపార్టుమెంట్లు అలాగే మినిస్ట్రీలను సందర్శించాలనుకునే వ్యాక్సిన్ పొందని వ్యక్తులు.. తప్పనిసరిగా పిసిఆర్ టెస్ట్ నెగెటివ్ రిజల్ట్ సమర్పించాల్సి వుంటుందని,ఈ నిబంధన ఆగస్ట్ 1 నుంచి అమల్లోిక వస్తుందని ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ (ఎఫఎహెచ్ఆర్) స్పష్టం చేసింది.48 గంటల ముందుగా తీసుకున్న సర్టిఫికెట్ మాత్రమే చెల్లుబాటవుతుంది. ఫెడరల్ గవర్నమెంట్ డిపార్టుమెంట్లు అలాగే మినిస్ట్రీస్‌ని సంప్రదించేవారికి సంబంధించి విడుదల చేసిన తాజా రూల్స్‌లో ఈ నిబంధన చేర్చడం జరిగింది.ట్విట్టర్ వేదికగా ఎఫ్ఎహెచ్ఆర్ ఈ విషయాన్ని వెల్లడించింది. వినియోగదారులు, సందర్శకులు, ఔట్ సోర్సింగ్ మరియు సర్వీస్ కంపెనీలు లేదా ఉద్యోగులు కానివారెవరైనా ఈ నిబంధన పాటించాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com