జ్యుడీషియల్ అథారిటీని అవమానించిన కేసులో వ్యక్తిపై తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం

- July 08, 2021 , by Maagulf
జ్యుడీషియల్ అథారిటీని అవమానించిన కేసులో వ్యక్తిపై తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం

బహ్రెయిన్: లోవర్ క్రిమినల్ కోర్టు, జ్యుడీషియల్ అథారిటీని అవమానించిన కేసులో నిందితుడిపై తీర్పు వెల్లడించనుంది. సోషల్ మీడియా వేదికగా నిందితుడు, జ్యుడీషియల్ అథారిటీని అవమానిస్తూ పోస్టింగ్స్ పెట్టినట్లు అభియోగాలున్నాయి. జ్యుడీషియల్ అథారిటీ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ కేసు విచారణ చేపట్టడం జరిగింది. నిందితుడికి సమన్లు జారీ చేసి, విచారించారు. నిందితుడు, ఆ వీడియో చేసిన విషయాన్ని అంగీకరించినా, జ్యుడీషియల్ అథారిటీస్ మీద విమర్శలు చేయాలన్నది తన ఉద్దేశ్యం కాదని వాదించాడు. పత్రికల్లో కేసుల వివరాలు ప్రచురించడం గురించి తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని ఆయన అంటున్నాడు. అవగాహన కల్పించేందుకు ఆ వీడియో చేశానని అన్నాడు. అథారిటీ మీద జుగుప్సాకరమైన ఆరోపణలు, వ్యాఖ్యలు నిందితుడు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com