నిలిచిన వర్షం నీళ్ళతో మునిగిన షేక్ జాయెద్ రహదారి
- March 09, 2016
కుండపోత వర్షం ధాటికి జాతీయ రహదారులు జల సంద్రాలుగా మారాయి. షేక్ జాయెద్ రహదారిపై నీళ్లు ఎక్కువ మొత్తంలో నీలిచిపోయిన కారణంగా వాహనదారులు గజిబిజి ట్రాఫిక్ లో ఇరుక్కొన్నారు. దీంతో షెక్ జాయెద్ రహదారిని కొంతకాలం నివారించాలని దుబాయ్ రహదారులు మరియు రవాణాశాఖ (ఆర్.టి.ఎ ) కోరారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలైన షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్ మరియు ఎమిరేట్స్ రహదారులను వాహనదారులు ఉపయోగించాలని వారు అభ్యర్దన చేశారు. ఈ సందర్భంగా వారు ట్వీటర్లో పేర్కొంటూ, అబూధాబీ నుంచి వెళ్ళేవారు...వచ్చేవారు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్ & ఎమిరేట్స్ రోడ్డుని ఉపయోగించుకోవాలని కోరారు. ఇందుకు కారణం ప్రస్తుతం అక్కడ ఎక్కువ మొత్తంలో వర్షం నీళ్ళు నిలిచి ఉండటమే ఇందుకు ముఖ్య కారణమని తెలిపారు. దుబాయ్ రహదారులు మరియు రవాణాశాఖ (ఆర్.టి.ఎ ) ట్రాఫిక్ పునరుద్ధరణకు ఎంతో శ్రమిస్తున్నారు. ఈ సందర్భం తమతో సహకరిస్తున్న రహదారి వినియోగదారులకు ధన్యవాదాలు తెలియచేశారు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న జాప్యాలకు క్షమాపణలు తెలియచేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







