తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- July 11, 2021 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 465 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నమోదు కాగా..మరో 04 మంది కరోనా బాధితులు మృతి చెందారు.. ఇక, 869 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో..ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,31,683 కు చేరగా.. రికవరీ కేసులు 6,17,638 కు పెరిగాయి.ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,729 గా ఉంది.కోవిడ్ బాధితుల రికవరీ రేటు 97.77 శాతంగా ఉందని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10,316 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. గత 24 గంటల్లో 65,607 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com