రోదసీయాత్ర విజయవంతం
- July 11, 2021
అమెరికా: రోదసి లోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించారు తెలుగు అమ్మాయి బండ్ల శిరీష . అంతరిక్షంలోకి చక్కర్లు కొట్టి తిరిగి భూమిని చేరుకుంది, రోదసీలోకి వెళ్లి వచ్చిన నాలుగో భారతీయరాలుగా శిరిష రికార్డు సృష్టించింది. కొద్దిగా ఆలస్యమైనప్పటికి వ్యోమనౌక VSS యూనిటీ-22 నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది.వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ , మిషన్ స్పెషలిస్టులు వర్జిన్ గెలాక్టిక్ చీఫ్ ఆస్ట్రోనాట్ ఇన్‌స్ట్రక్టర్ బెత్ మోజెస్, వర్జిన్ గెలాక్టిక్ లీడ్ ఆపరేషన్స్ ఇంజినీర్ కోలిన్ బెన్నెట్‌తో కలిసి శిరీష స్పేస్ జర్నీ చేశారు.గంటసేపు అంతరిక్షంలో గడిపారు శిరీష అండ్ కంపెనీ.

మానవ సహిత వ్యోమనౌక VSS-యూనిటీ-22ను VMS-ఈవ్ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లింది. 90 నిముషాల పాటు ఈ అంతరిక్ష యాత్ర కొనసాగింది . సామాన్యులను రోదసీ లోకి తీసుకెళ్లేందుకే ఈ యాత్ర చేపట్టినట్టు వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ ప్రకటించారు. 34 ఏళ్ల బండ్డ శిరీష తెలుగు వాళ్లందరికి గర్వకారణంగా నిలిచారు. తొలిసారి అంతరిక్షం లోకి మానవులను తీసుకెళ్లిన ప్రయోగంగా యూనిటీ -22 రికార్డు సృష్టించింది.
భారత్ నుంచి అంతరిక్షానికి దూసుకెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర సృష్టించారు. ఇంతకుముందు రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, భారత-అమెరికన్ సునీతా విలియమ్స్ రోదసిలోకి వెళ్లి వచ్చారు. 90 కిలోమీటర్ల ఎత్తుకు ఈ వ్యోమనౌక ప్రయాణం చేసింది. భూ వాతావరణానికి , అంతరిక్షానికి బోర్డర్‌గా భావించే కర్మాన్ రేఖను దాటి ప్రయాణం చేసింది. ఇలా స్పేస్ జర్నీ చేసిన వాళ్లనే వ్యోమగాములుగా పరిగణిస్తారు.
కొద్దిసేపు వాళ్లు భారరహిత స్థితికి చేరుకుంటారు. సామాన్యులకు రోదసీయానం అవకాశం ఇచ్చేందుకు ఈ జర్నీ చేసినట్టు వర్జిన్ గెలాక్టిక్ ప్రకటించింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







