పబ్లిక్, ప్రైవేట్ సంస్థలన్ని ఈ-వీసాతో రిజిస్టర్ చేసుకోవాలన్న NPRA

- July 12, 2021 , by Maagulf
పబ్లిక్, ప్రైవేట్ సంస్థలన్ని ఈ-వీసాతో రిజిస్టర్ చేసుకోవాలన్న NPRA

బహ్రెయిన్: అన్ని రంగాలు, విభాగాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్ని ఈ వీసా సిస్టం http://www.evisa.gov.bh. ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని జాతీయత, పాస్ పోర్ట్స్& రెసిడెన్సీ వ్యావహారాలు-NPRA పిలుపునిచ్చింది. ప్రోవైడెడ్ సర్వీసెస్ ద్వారా పూర్తి లబ్ధి పొందేందుకు ఇప్పటికే రిజిస్టర్ అయిన సంస్థలు తమ పూర్తి డేటాను అప్ డేట్ చేయాలని సూచించింది. రిజిస్టర్ చేసుకున్న సంస్థలు వర్కింగ్ సమయం తర్వాత కూడా ఏ క్షణంలోనైనా విజిట్ వీసా వంటి సర్వీసుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే తమ దరఖాస్తులు ఏ దశలో ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఈ-మెయిల్ నోటిఫికేషన్ పొందవచ్చని NPRA వివరించింది. ఏవైనా సందేహాలు ఉంటే 17399764 నెంబర్ ద్వారా కమ్యూనికేషన్ సెంటర్ ను కాంటాక్ట్ కావొచ్చని వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com