‘నారప్ప’ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారు
- July 12, 2021హైదరాబాద్: విక్టరీ వెంకటేశ్, ప్రియమణి జంటగా తెరకెక్కిన ‘నారప్ప’ చిత్రం విడుదల విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు అనుకున్న విధంగానే ‘నారప్ప’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు నిర్మాత సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను. ఈ రోజు సాయంత్రం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం పోస్టర్ రూపంలో వచ్చేసింది. జూలై 20న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అక్టోబర్ నెలాఖరు వరకూ సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం చేసిన తీర్మానాన్ని పట్టించుకోకుండానే సురేశ్ బాబు ‘నారప్ప’ ను ఓటీటీలో విడుదల చేస్తుండటం విశేషం.
అయితే… తన చిత్రాలకు సంబంధించిన అగ్రిమెంట్ ఆ తీర్మానం చేయడానికి ముందే జరిగిందన్నది సురేశ్ బాబు వాదనగా కనిపిస్తోంది. నిన్న మణిశర్మ పుట్టిన రోజు సందర్భంగా ‘నారప్ప’లోని ఓ పాటను విడుదల చేశారు. దానికి మంచి అప్లాజ్ వచ్చింది. అదే వేడిలో ఈ రోజు సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ‘నారప్ప’ విషయంలోనే కాకుండా తోటి నిర్మాతలతో కలిసి సురేశ్ బాబు నిర్మిస్తున్న ‘విరాట పర్వం’, ‘దృశ్యం -2’ చిత్రాలు సైతం ఓటీటీ బాట పట్టడం ఖాయంగా తెలుస్తోంది. మరి ఆ సినిమాల స్ట్రీమింగ్ తేదీలను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు