ఏపీ 2016-17 బడ్జెట్ లక్షా 35వేల కోట్లు ...
- March 10, 2016
ఆంధ్రప్రదేశ్ 2016-17 బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభలో ప్రవేశ పెట్టారు. తొలిసారిగా ఈ-బడ్జెట్‌ను రూపొందించారు. సభ్యులకు ఈ-బడ్జెట్ కాపీలను ట్యాబ్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. అబ్దుల్ కలాం సుభాషితంతో యనమల బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. మొత్తం బడ్జెట్ రూ.లక్షా 35 కోట్లుగా తెలిపారు. ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
* 2016-17 బడ్జెట్ లక్షా 35వేల కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ.86,554.55కోట్లు * ప్రణాళిక వ్యయం రూ.49,134.44కోట్లు * గతేడాదితో పోలిస్తే 20.13శాతం బడ్జెట్ వృద్ధి అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు * ఆకర్షణీయ వార్డులు, గ్రామాలకు రూ.3,100 కోట్లు * పారిశుద్ధ్యం కోసం రూ.320 కోట్లు * పట్టణ పరిపాలనకు రూ.4,728.95 కోట్లు * ఉపాధి హామీ పథకానికి రూ.4,764.71 కోట్లు * గ్రామీణ నీటి సరఫరాకు రూ.1,195.63 కోట్లు * గ్రామీణాభివృద్ధికి రూ.4,467 కోట్లు * క్రీడా శాఖకు రూ.215 కోట్లు కాపు కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు * బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.65 కోట్లు * మైనార్టీ సంక్షేమానికి రూ.710కోట్లు * బీసీల సంక్షేమానికి రూ.8,832కోట్లు * ఎస్టీ సంక్షేమానికి 3,100 కోట్లు * ఎస్సీ సంక్షేమానికి 8,724కోట్లు * యువత సాధికారత కోసం రూ.252 కోట్లు * మహిళా సాధికారిత కోసం రూ.642కోట్లు గృహ నిర్మాణానికి రూ.1,132 కోట్లు * ఇంధన భద్రతకు రూ.4,020 కోట్లు * రహదారి భద్రతకు రూ.150 కోట్లు * రాష్ట్రంలో రహదార్ల అభివృద్ధికి రూ.3,184 కోట్లు * కృష్ణా పుష్కరాలకు రూ.250కోట్లు * పర్యాటక శాఖకు రూ.227 కోట్లు * ఐటీశాఖకు రూ.360 కోట్లు ఉన్నత విద్యకు రూ.2,642 కోట్లు * ఐసీడీఎస్ పథకానికి రూ.772 కోట్లు * వైద్య ఆరోగ్యశాఖకు రూ.2,933 కోట్లు * ఉన్నత విద్యకు రూ.2,642 కోట్లు * ప్రాథమిక విద్యకు రూ.17,502 కోట్లు * చేనేత రంగానికి రూ.127 కోట్లు * గనులు, భూగర్భ శాఖ ద్వారా 1,632 కోట్ల రాబడి ఆశిస్తున్నాం * ఆహార పరిశ్రమకు రూ.100 కోట్లు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు చెక్ * ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు చర్యలు * శేషాచల అడవుల్లో స్మగ్లింగ్ నిరోధానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం. * లైవ్ స్టాక్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక * ఫిషరీస్ అభివృద్ధికి ప్రణాళిక 16శాతం మేర పెరిగిన ఆదాయం * 2014-15 రెవెన్యూ లోటు కింద కేంద్రం రూ.3వేలకోట్లు ఇచ్చింది * తొలి ఏడాది రెవెన్యూ లోటు రూ.13,897 కోట్లు * 2015-16 సంవత్సరం ఆదాయ లోటు రూ.4,140 కోట్లు * 2015 -16 బడ్జెట్ లోటు రూ.17వేల కోట్లు * 2016-17 రెవెన్యూ లోటు రూ.4,868 కోట్లుగా అంచనా * 2016-17 వాస్తవ లోటు రూ.20,497 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు రూ.3,660కోట్లు * పోలవరం ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరిస్తుంది. * జలవనరులశాఖకు రూ.7,325కోట్లు * పట్టిసీమ ప్రాజెక్టు విజయవంతమైంది. * చిన్ననీటి పారుదల రంగానికి రూ.674 కోట్లు * తోటపల్లి, పోలవరం కుడికాలువ, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తాం. * వంశధార, గుండ్లకమ్మ, వెలుగొండ ప్రాజెక్టులను 2018లోపు పూర్తి చేస్తాం! * నీటిపారుదల పథకాలను శీఘ్రగతిన పూర్తి చేసేందుకు రూ.3,135.25కోట్లు * గతేడాది మొత్తం 76,818 మందికి ఉపాధి కల్పించాం. * శాంతి భద్రతల రక్షణకు నిధుల పెంపు వ్యవసాయాభివృద్ధికి రూ.5,838కోట్లు * పట్టు పరిశ్రమకు రూ.147కోట్లు * ఉద్యానశాఖకు రూ.659కోట్లు * పశుసంవర్థకశాఖకు రూ.819 * మత్య్సశాఖకు రూ.339కోట్లు * వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.16,491కోట్లు * రుణ విముక్తి పథకానికి రూ.3,512 కోట్లు * గ్రామీణాభివృద్ధికి రూ.4,467కోట్లు * వ్యవసాయ రంగానికి 7గంటల విద్యుత్ సరఫరాకు కట్టుబడి ఉన్నాం మహిళా సాధికారిత కోసం ప్రత్యేక ప్రాజెక్టు * సాంఘిక భద్రత పింఛన్ల కోసం రూ.2,998 కోట్లు * చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌కు జైకా సాయం * విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు ఏడీబీ సాయం * చెన్నై-బెంగళూరు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఈ ఏడాది ప్రారంభిస్తాం
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







