దుబాయ్ రెసిడెన్సీ వీసా: కొత్త మెడికల్ ఫిట్నెస్ సెంటర్ ప్రారంభం

- July 13, 2021 , by Maagulf
దుబాయ్ రెసిడెన్సీ వీసా: కొత్త మెడికల్ ఫిట్నెస్ సెంటర్ ప్రారంభం

దుబాయ్: దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్ఎ), కొత్త మెడికల్ ఫిట్నెస్ సెంటర్‌ని బుర్ దుబాయ్‌లో ఏర్పాటు చేసింది. దీంతో మొత్తంగా డిహెచ్ఎ 17 మెడికల్ ఫిట్నెస్ సెంటర్లను ఎమిరేట్ వ్యాప్తంగా కలిగి వున్నట్లయ్యింది. వీటి ద్వారా వీసాలను జారీ చేయడం, రెన్యువల్ చేయడం చేస్తారు. కొత్త సెంటర్, సెంట్రల్ మాల్‌లో షరాఫ్ డిజి మెట్రో సేడియం దగ్గర (ఎగ్జిట్ 4) వుంది. ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 7.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2.30 నిమిషాల వరకు ఈ సెంటర్ సేవలందిస్తుంది. రోజుకి 500 మంది పేషెంట్లకు సేవలందిస్తుంది. డిమాండ్‌కి అనుగుణంగా సామర్థ్యాన్ని అలాగే సమయాన్ని పెంచుతామని డిహెచ్ఎ పేర్కొంది. అధికారిక కేంద్రాల ద్వారా వలసదారులు రెసిడెన్సీ వీసా పొందడానికి మెడికల్ టెస్టులు చేయించుకోవాల్సి వుంటుంది. డిహెచ్ఎ మెడికల్ ఫిట్నెస్ డైరెక్టర్ మైసా అల్ బుస్తాని మాట్లాడుతూ, వేగవంతమైన సమర్థవంతమైన సేవల్ని అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. గత కొన్నేళ్ళుగా టెక్నాలజీని అద్భుతంగా వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. డిహెచ్ఎ తమ సెంటర్ల వద్ద కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటోందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com