ఏపీ కరోనా అప్డేట్

- July 13, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 81,763 శాంపిల్స్‌ పరీక్షించగా.. 2,567 మందికి పాజిటివ్‌గా తేలింది.మరో 18 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.తాజా మృతుల్లో గుంటూరులో నలుగురు, చిత్తూరు,నెల్లూరులో ముగ్గురు చొప్పున, తూర్పు గోదావరి, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు కన్నుమూశారు. ఇక, ఇదే సమయంలో 3,034 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు.. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 2,31,30,708 శాంపిల్స్‌ పరీక్షించామని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. తాజా కేసులతో కలుపుకొని పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,26,988కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 18,87,236కు పెరిగింది.ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి 13,042 మంది మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 26,710 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com