హజ్ యాత్రికుల తొలి స్మార్ట్ కార్డు విడుదల
- July 14, 2021
సౌదీ: ఈ ఏడాది హజ్ యాత్రకు సంబంధించి యాత్రికుల కోసం సౌదీ అరేబియా తొలి స్మార్ట్ హజ్ కార్డును విడుదల చేసింది. భక్తులకు అందించే సేవలు అన్నింటికి ఈ స్మార్ట్ కార్డు అనుసంధానం చేయబడి ఉంటుంది. అంటే యాత్రికులకు మక్కాలోని హోటల్స్ లో ఎంట్రీ, పవిత్ర ప్రదేశాలలోని గుడారాలతో పాటు రవాణా వంటి అన్ని సేవలతో స్మార్ట్ కార్డ్ లింక్ అయి ఉంటుంది. ఒకవేళ భక్తులు దారి తప్పినా వారి శిబిరాలకు స్మార్ట్ కార్డ్ మార్గనిర్దేశకం చేస్తుంది. అలాగే పాయింట్స్ పద్దతిన పేమెంట్లు కూడా చేయవచ్చు. శిబిరాల నుంచి మక్కాకు వెళ్లి వచ్చేందుకు, మక్కా నుంచి ఇతర పవిత్ర స్థలాలను సందర్శించే సమయంలో నాణ్యమైన రవాణా సేవలు పొందేందుకు అందించేందుకు స్మార్ట్ కార్డ్ దోహదపడనుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







