రక్తదాతలకు లాక్ డౌన్ వేళలోనూ అనుమతి
- July 14, 2021
మస్కట్: కోవిడ్ నియంత్రణకు పాక్షిక కర్ఫ్యూ ప్రకటించిన ఒమన్ ప్రభుత్వం..రక్తదాతలకు లాక్ డౌన్ సమయాల్లో తాత్కాలికంగా ప్రత్యేక అనుమతులు జారీ చేస్తోంది. కర్ఫ్యూ సమయంలోనూ వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బౌషెర్లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ కు చేరుకునేలా ఈ పర్మిట్లను ఇస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బౌషెర్ లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసే రెండు రోజుల ముందే వాట్సాప్ నెంబర్ 94555648 ద్వారా తాత్కాలిక పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలు పరిశీలించిన తర్వాత సంబంధిత అధికారుల నుంచి వాట్సాప్ ద్వారా టెంపరరీ పర్మిట్ కాపీ పంపిస్తారు. ఆ తర్వాత బ్లడ్ బ్యాంక్ నుంచి కూడా రక్తదాతకు మరో పర్మిట్ వస్తుంది. రక్తం దానం చేయాలనుకునే వారు శనివారం నుంచి గురువారం వరకు ప్రతి రోజు ఉదయం 8గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్యలో బ్లడ్ బ్యంక్ ను సంప్రదించవచ్చు. ఇదిలాఉంటే ఆరోగ్య శాఖ వివరాలు మేరకు ప్రస్తుతం ప్రస్తుతం ఒమన్లో 5000 బ్లడ్ యూనిట్లు అవసరం. అంటే ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన బ్లడ్ యూనిట్లను అందించాలంటే బౌషెర్లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ కు ప్రతి రోజు 100 నుంచి 120 మంది రక్తదాతలు అవసరం.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







