ఈద్ అల్ అధా తొలి 3 రోజులు ఫ్రీ పార్కింగ్
- July 14, 2021
షార్జా: ఈద్ అల్ అధా పురస్కరించుకొని పబ్లిక్ పార్కింగ్ లో ఉచిత పార్కింగ్ వెసులుబాటు కల్పించారు అధికారులు. ఈద్ అల్ అధా తొలి మూడు రోజుల పాటు పబ్లిక్ పార్కింగ్ లో ఎలాంటి ఫీజు చెల్లించకుండానే వాహనాలు పార్క్ చేసుకోవచ్చని సోషల్ మీడియాలోని తమ అధికారిక అకౌంట్ ద్వారా వెల్లడించారు. జులై 20 నుంచి 22 వరకు ఉచితంగానే వాహనాలను పార్క్ చేసుకోవచ్చు. అయితే..ఈ మినహాయింపు అరాఫత్ డే రోజున ఉండదు. జులై 19న యధావిధిగా పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సెవెన్ డేస్ పార్కింగ్ జోన్లలో కూడా ఉచిత పార్కింగ్ ఆదేశాలు వర్తించవని అధికారులు తెలిపారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







