బస్సులో ఊపిరి ఆడక చిన్నారి మృతి

- July 14, 2021 , by Maagulf
బస్సులో ఊపిరి ఆడక చిన్నారి మృతి

యుఏఈ: ఓ చిన్నారి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయిన ఘటన అజ్మన్‌లో జరిగింది. చిన్నారిని నిర్లక్ష్యపూరితంగా బస్సులో విడిచి పెట్టినట్లు తేలింది. చిన్నారి వయసు 3 సంవత్సరాల 8 నెలలు. చిన్నారి నిద్రపోతుండగా, 4 గంటల పాటు బస్సులో వదిలేశారనీ అధికారులు తెలిపారు. బస్సు సూపర్ వైజర్‌ని నిందితుడిగా పోలీసులు తేల్చారు. బాలుడిని అరబ్ జాతీయుడిగా గుర్తించారు. బస్సు ఓ టాలెంట్ డెవలప్‌మెంట్ సెంటర్‌కి చెందినదని పోలీసులు తెలిపారు. ఆ సెంటర్ కమర్షియల్ లైసెన్స్ ఏడాది క్రితమే గడువు తీరిపోయింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com