మనీ ల్యాండరింగ్ కేసులో జైలు శిక్షకు సమర్ధన
- July 14, 2021
బహ్రెయిన్: మనీ ల్యాండరింగ్ కేసులో నిందితులకు హై అప్పీల్స్ కోర్టు జైలు శిక్షను సమర్ధించింది. ఓ ప్రొడక్షన్ కంపెనీ అధినేత అలాగే ఇద్దరు ఈ కేసులో దోషులుగా తేలారు. గతంలో వీరికి న్యాయ స్థానం ఐదేళ్ల జైలు శిక్షతో పాటు, 5,000 బహ్రెయినీ దినార్స్ జరిమానా విధించింది. అలాగే దోషుల నుండి 200,000 బహ్రెయినీ దినార్స్ స్వాధీనం చేసుకోవల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో నాలుగో వ్యక్తి కూడా నిందితుడిగా ఉన్నప్పటికీ, సరైన ఆధారాలు లేని కారణంగా అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. పెద్ద మొత్తంలో డబ్బుని నిందితులు వ్యభిచారం ద్వారా సమీకరించినట్లు విచారణలో తేలింది. ఆ మొత్తాన్ని వేరు వేరు పద్ధతుల్లో ఇద్దరు నిందితులకు, మొదటి నిందితుడు చేరవేసినట్లు నిర్ధారించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







