సిబ్బందికి వ్యాక్సిన్లు వేయించిన తొలి ఆలయంగా నిలిచిన చిలుకూర్ బాలాజీ ఆలయం
- July 15, 2021
హైదరాబాద్: చిలుకూర్ బాలాజీ ఆలయం, ఆలయం యొక్క గోశాల వద్ద ఈ రోజు తమ సిబ్బందికి మరియు వారి కుటుంబాలకు ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్‌ను నిర్వహించింది. 50 మందికి పైగా ఉన్న సిబ్బందికి మరియు వారి కుటుంబాలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఇవ్వడం జరిగింది. వ్యాక్సిన్ ల శిబిరాన్ని ఉదయం 9 గంటలకు ప్రారంభించగా మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది.
వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమాన్ని పవన్ కుమార్ సమన్వయపరచగా స్వచ్చంద సంస్థ అయిన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ మరియు నిర్మల హాస్పిటల్స్ తమ మద్దతును అందించాయి.వ్యాక్సిన్ డ్రైవ్‌ను పర్యవేక్షించేందుకుగాను హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్‌కు మరియు నిర్మల హాస్పిటల్స్‌కు చెందిన వైద్యులు, నర్సులు, కౌన్సిలర్ల బృందాన్ని నియమించారు.
ఆలయ సిబ్బందిలో ప్రధానంగా గోశాలలో పనిచేసే వారు ఆలయ ప్రాంగణం నిర్వహణకు సంబంధించిన పారిశుధ్య సిబ్బంది మరియు అర్చకులు ఉన్నారు. వైద్యులు సిబ్బంది యొక్క ప్రధాన శరీర అవయవాల పనితీరును తనిఖీ చేసిన పిమ్మట వ్యాక్సిన్ లు వేయించుకునే ఆలయ సిబ్బందికి కౌన్సెలింగ్‌ను అందించి, టీకా తీసుకున్న తరువాత ఎదురయ్యే దుష్ప్రభావాలు అర్థం అయ్యేలా వారికి వివరించారు మరియు జ్వరం లేదా ఒంటి నొప్పులు వంటివి తలెత్తితే ప్రాథమిక ఔషధాలను తీసుకోవలసిన అవసరాన్ని గురించి కూడా వారికి తెలియజేశారు.
చిలుకూర్ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సి. ఎస్. రంగరాజన్ మాట్లాడుతూ, అన్ని మత సంస్థలు వ్యాక్సిన్ లను ప్రోత్సహించాలని దానిని సాధించేందుకు ప్రార్దన స్థలాల ప్రాంగణంలోనే వర్కర్లకు వ్యాక్సిన్ లు వేయడం ఉత్తమ మార్గమని అన్నారు. ఆలయ పరిధి ప్రాంగణంలోనే టీకా శిబిరాన్ని నిర్వహించడం ద్వారా ప్రమాదానికి గురయ్యే వర్గానికి త్వరగా టీకాలు అందించేందుకు సహాయపడిరది, ఎందుకంటే ప్రభుత్వ విధులను నిర్వర్తించడంలో నిమగ్నమైనటువంటి ఇతర ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే దేవాలయ సిబ్బంది కూడా ఫ్రంట్ లైన్ వర్కర్లే.
ఆలయంతో వివిధ ఇంటర్ఫెయిత్ ప్రాజెక్టులపై పనిచేస్తున్న స్వచ్చంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్‌కు ఈ సందర్బంగా ధన్యవాదాలని రంగరాజన్ అన్నారు, లాక్ డౌన్ సడలింపుతో ప్రజలు అది మసీదు, చర్చి, గురుద్వార ఏదైనా కావచ్చు ప్రజలు మతపరమైన ప్రదేశాలకు తరలిరావడం పెరిగిపోయింది తప్పనిసరిగా ఆయా ప్రదేశాలలో టీకాలు అందించాలి.
అల్ప ఆదాయ వర్గాలలో అపోహల కారణంగా వ్యాక్సిన్ పట్ల సంకోచం ఉన్నది మరియు మతపరమైన ప్రదేశాలు ప్రమాదంలో ఉన్న వర్గాలకు వ్యాక్సిన్ లను వేయడంలో ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది, వ్యాక్సిన్ డ్రైవ్‌లో ఎక్కువమంది పాల్గొనేలా చేయడం ద్వారా సమాజంలో విశ్వాసాన్ని పెంచడమే కాకుండా కరోనా మహమ్మారిపై చేసే యుద్దంలో అది ఎంతో కీలకం కూడా, అని హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, ముజ్తాబా హసన్ అస్కారి అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







