హర్యానా గవర్నర్​గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం

- July 15, 2021 , by Maagulf
హర్యానా గవర్నర్​గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం

చండీగఢ్: హర్యానా గవర్నర్​గా బండారు దత్తాత్రేయ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ఝా.. దత్తాత్రేయతో ప్రమాణం చేయించారు. అతితక్కువ మంది ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే హాజరయ్యారు. హర్యానా సీఎం మనోహర్ లాల్, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌటాలా మరికొందరు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 1980లో తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యదర్శిగా మొదలైన దత్తాత్రేయ ప్రస్థానం.. పలుమార్లు ఎంపీగా, రెండు సార్లు కేంద్రమంత్రిగా పనిచేశారు. . 2019లో కేంద్రం.. ఆయన్ని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్​గా నియమించగా.. తాజా పరిణామాల నేపథ్యంలో హర్యానా గవర్నర్​గా బదిలీ అయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com