రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- July 15, 2021
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కాశీలో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించారు. జపాన్ దేశ సహకారంతో ఆ కేంద్రాన్ని నిర్మించారు. కాశీ అంటే శివుడు అని, రుద్రాక్ష్ లేకుండా ఆ నగరం అభివృద్ధి చెందినట్లు ఎలా చెబుతామని ఆయన అన్నారు. కాశీ పట్టణం ఇప్పుడు రుద్రాక్షను ధరించినట్లు ఆయన తెలిపారు. ఇక నుంచి ఆ పట్టణ శోభ మరింత పెరుగుతుందని ప్రధాని చెప్పారు. వారాణాసిలో పర్యటిస్తున్న ప్రధాని అక్కడ 1500 విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. కన్వెన్షన్ సెంటర్లో రుద్రాక్ష మొక్కను నాటారు.
ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మాట్లాడారు. వారణాసిలో రుద్రాక్ష్ సెంటర్‌ను నిర్మించినందుకు ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని యోషిడే సుగాకు ఆయన కృతజ్ఞతలు ఎతలిపారు. ఇండో-జపాన్ స్నేహానికి రుద్రాక్ష్ సెంటర్ సంకేతంగా నిలుస్తుందని యోగి అన్నారు.

ఆధునిక సాంకేతికతో రుద్రాక్ష్‌ను నిర్మించారు. సుమారు 1,200 మంది కూర్చునే సామర్థ్యం కలిగి ఉంది. రెండు అంతస్తుల కన్వెన్షన్ సెంటర్‌ను జపనీస్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ (జైకా) సహకారంతో నిర్మించారు. దాదాపు 200 కోట్ల వ్యయంతో మూడు ఎకరాల విస్తీర్ణంలో వారణాసిలోని సిగ్రా ప్రాంతంలో దీన్ని నిర్మించారు. ఈ సెంటర్ లో అన్ని రకాల అంతర్జాతీయ సమావేశాలు, సంగీత కచేరీలు, ప్రదర్శనలు నిర్వహించనున్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూనే అందుకు కావాల్సిన సదుపాయాల్ని అందించనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







