సానియా మిర్జా, షోయబ్ మాలిక్ కు గోల్డెన్ వీసా
- July 15, 2021
యూఏఈ: ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కు యూఏఈ పదేళ్ల గోల్డెన్ వీసాను మంజూరు చేసింది. దేశంలోని వివిధ రంగాల్లో విశేష సేవలు అందించే వారికి, ప్రముఖ వ్యాపారులకు, సాంకేతిక నిపుణులకు మాత్రమే గోల్డెన్ వీసాలను జారీ చేస్తారు. పదేళ్లు, ఐదేళ్లు గడువు ఉన్న దీర్ఘకాల వీసాలను 2019 నుంచి యూఏఈ మంజూరు చేస్తూ వస్తోంది. పాక్-భారత్ జంట షోయబ్, సానియా మిర్జాను కూడా గోల్డెన్ వీసాతో యూఏఈ గౌరవించింది. ఇండియన్ టెన్నిస్ కు ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన సానియా మిర్జా ప్రస్తుతం లండన్‌లో జరుగుతున్న వింబుల్డన్ టోర్నీలో పాల్గొంటున్నారు. విమెన్ డబుల్స్ లో సెకండ్ రౌండ్ చేరుకోగా, రోహన్ బొపన్నతో కలిసి మిక్స్ డ్ డబుల్స్ లో థార్డ్ రౌండ్ కి చేరుకున్నారు సానియా. ఇక పాక్ మాజీ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ 35 టెస్టులు, 287 వన్డే మ్యాచ్‌లు, 116 టీ-ట్వంటీ మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







