6,600 మంది ఆఫీసర్లకు ప్రమోషన్లు
- July 15, 2021
దుబాయ్: యూఏఈ ప్రధాని, దూబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ లోని 6,600 మంది ప్రభుత్వ అధికారులకు పదోన్నతులు కలిపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రమోషన్ పొందిన వారిలో పోలీసులు, జనరల్ ఆఫీసర్, రెసిడెన్సీ& ఫారెన్ అఫైర్స్, జీడీఆర్ఎఫ్ఏ, దుబాయ్ సివిల్ డిఫెన్స్ విభాగాల్లోని అధికారలతో పాటు నాన్-కమిషన్డ్ ఆఫీసర్లు ఉన్నారు.
దుబాయ్ రూలర్ ఆదేశాల మేరకు లెఫ్టినెంట్ జనరల్ పొందిన సీనియర్ అధికారుల్లో ప్రమోషన్ పొందిన ఉన్నతాధికారుల్లో జీడీఆర్ఎఫ్ఏ డైరెక్టర్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మర్రి, దుబాయ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ రషీద్ తని అల్ మాత్రూషి, దుబాయ్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ తలాల్ హుమైద్ బల్హౌల్ అల్ ఫలాసీలు ఉన్నారు. లెఫ్టినెంట్ జనరల్ గా పదోన్నతి పొందిన సీనియర్ అధికారులు అందరూ దుబాయ్ లో శాంతి భద్రతలను మెరుగుపర్చటంలో విశేష సేవలు అందించారని అన్నారు. ప్రపంచంలోనే సురక్షిత నగరాల్లో దుబాయ్ చోటు దక్కించుకుందంటే అది వీరి కృషి ఫలితమేనని ప్రశంసించారు. ఇదిలాఉంటే..శాఖల వారీగా పదోన్నతులు పొందిన వారిలో దుబాయ్ పోలీస్ విభాగంలో NCOలు, పోలీసులు అధికారులు 5,823 మంది అధికారులు ఉన్నారు. జీడీఆర్ఎఫ్ఏలో 483 మంది, దుబాయ్ సివిల్ డిఫెన్స్ లో 299 మందికి పదోన్నతులు దక్కయి.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







