ఏపీలో తగ్గిన కరోనా కేసులు..ఆ మూడు జిల్లాల్లో మాత్రం తగ్గట్లేదు
- July 15, 2021
రాష్ట్రంలో కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కొవిడ్ రూల్స్ విషయంలో పక్కాగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే కేసులు తగ్గుముఖం పట్టినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు తగ్గడం ఊరటనిస్తోండగా.. చిత్తూరు, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో మాత్రం రోజువారీ కేసులు 300కు పైగా నమోదవుతూ ఉన్నాయి.
గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 93,785 శాంపుల్స్‌ని పరీక్షించగా 2,526 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 80, చిత్తూరు జిల్లాలో 391, తూర్పుగోదావరి జిల్లాలో 404, గుంటూరు జిల్లాలో 178, కడప జిల్లాలో 157, కృష్ణాజిల్లాలో 269, కర్నూలు జిల్లాలో 35, నెల్లూరు జిల్లాలో 210, ప్రకాశం జిల్లాలో 308, శ్రీకాకుళం జిల్లాలో 91, విశాఖపట్నం జిల్లాలో 119, విజయనగరం జిల్లాలో 49, పశ్చిమగోదావరి జిల్లాలో 235 పాజిటివ్ కేసులు మోదయ్యాయి.
గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో 22 మంది చనిపోగా.. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 13,081కి చేరుకుంది. ఇదే సమయంలో 2,933 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. రాష్రంలో ఇప్పటివరకు 2,33,14,697 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 25వేల 526గా ఉంది.
#COVIDUpdates: 15/07/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 15, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,29,210 పాజిటివ్ కేసు లకు గాను
*18,90,603 మంది డిశ్చార్జ్ కాగా
*13,081 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 25,526#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/SIzeHQ3NjX
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్







