ఏపీ: బక్రీద్ నిర్వహణకు ఆంక్షలు విధించిన ప్రభుత్వం
- July 16, 2021
అమరావతి: ఏపీలో కోవిడ్ నియంత్రణ కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూ కొనసాగుతున్న దృష్ట్యా బక్రీద్ నిర్వహణకు ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఈద్గాహ్ లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రార్ధనలు నిషేధిస్తున్నట్టు మైనారిటీ సంక్షేమశాఖ ప్రకటించింది. భారీ జన సమూహాలను నివారించేందుకు మసీదుల్లో మాత్రమే ప్రార్ధనలకు అనుమతినిచ్చింది. భౌతిక దూరం పాటిస్తూ.. మసీదుల్లో 50 శాతం మందికి మాత్రమే ప్రార్ధనలకు అనుమతిస్తున్నట్టు మైనారిటీ సంక్షేమశాఖ పేర్కొంది.
మాస్కులు లేకుండా మసీదుల్లోకి అనుమతించవద్దని కమిటీలకు ఆదేశాలు జారీ చేశారు. మసీదు ప్రాంగణాల్లో శానిటైజర్లు, సబ్బులు అందుబాటులో ఉంచాల్సిందిగా కమిటీలకు ఆదేశించారు. వృద్ధులు, పిల్లలు ఇంటి వద్ద ప్రార్ధనలు చేసుకోవాల్సిందిగా సూచనలు చేశారు. ఈద్ మిలాప్ , ముసాఫా, ఆప్తులను కౌగిలించుకోవటం లాంటి కార్యక్రమాలను చేయొద్దని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం. మాంసం విక్రయ కేంద్రాల్లోనూ కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, అధికారులకు, ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







