50 వేలకు పైగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు విదేశాల నుంచి సమర్పణ, 12,000 సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి

- July 16, 2021 , by Maagulf
50 వేలకు పైగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు విదేశాల నుంచి సమర్పణ, 12,000 సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి

కువైట్: కువైట్ వెలుపల ఉండి, కువైట్ వచ్చేందుకు వీలుగా మినిస్ర్టీ వెబ్ సైట్లో ఇప్పటి వరకూ 50,000 మందికి పైగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేశారు. వీటిని పరిశీలించే ప్రక్రియ కొనసాగుతోంది. 12,000 సర్టిఫికెట్లు ఇప్పటికే సాంకేతిక నిపుణుల బృందం ద్వారా ఆడిట్ చేయడం జరిగింది. క్యాబినెట్ నిర్ణయం ప్రకారం, నాన్ కువైటీలు, కువైట్ వచ్చేందుకు అనుమతి పొందిన వ్యాక్సిన్ల ద్వారా వ్యాక్సినేషన్ పొందాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్లను మినిస్ర్టీకి పంపాలి. అరబ్ మరియు ఆసియా దేశాలకు చెందిన కొన్ని సర్టిఫికెట్ల పరిశీలన కొంత ఆలస్యమవుతుంది. బార్ కోడ్ కొన్నింటికి లేకపోవడంతో, ఈ సమస్య తలెత్తుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com