అబుధాబిలో రాడార్స్ ఆక్టివేషన్..రాత్రివేళ బయటికొస్తే ఫైన్
- July 19, 2021
అబుధాబి: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు స్టెరిలైజేషన్ చేపట్టిన అబుధాబి పాలనా యంత్రాంగం..ప్రజలను బయటికి రాకుండా కట్టడి చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. అబుధాబి వ్యాప్తంగా ఇవాళ్టి (సోమవారం) నుంచి స్టెరిలైజేషన్ ప్రారంభం కానుంది. స్టెరిలైజేషన్ ప్రక్రియకు అవాంతరాలు లేకుండా మధ్యరాత్రి 12 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అహారం, మెడిసిన్ వంటి అత్యవసర అవసరాలు ఉన్నవారికి మాత్రమే ఇళ్ల నుంచి బయటికి రావొచ్చు. అదీ కూడా అబుధాబి పోలీసుల నుంచి ముందస్తుగా పర్మిషన్ తీసుకొని ఉండాలి. అంటే దాదాపుగా ఆంక్షలు అమలులో ఉన్న ఈ 5 గంటలు కర్ఫ్యూ విధించినట్లే అనమాట. ఈ సమయంలో ఎవరైనా ఆంక్షలను అతిక్రమించి ఇళ్ల నుంచి బయటికి వచ్చేవారుంటే వారిని గుర్తించేందుకు రాడార్ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రాడార్స్ సాయంతో ఆంక్షలను అతిక్రమించినవారిని గుర్తించి జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!







