కొత్త(కరోనా) కథలు..రచయితలకు కృతజ్ఞతలు తెలిపిన డా.ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి
- July 19, 2021
కొత్త (కరోనా) కథలు - 4 కథా సంకలనానికి ఆర్థిక సహకారం అందించిన డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి (డల్లాస్)కి ధన్యవాదాలు తెలిపేందుకు 7 దేశాలకు చెందిన 80 మంది రచయితలు, ఇతర ప్రముఖులు జులై 17న సోషల్ మీడియా వేదికగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా భువనచంద్ర మాట్లాడుతూ రచయితలో మానవత్వంతో పాటు మాతృత్వం ఉండాలన్నారు. 80 మంది రచయితల కథలను ఒకే పుస్తకంలో ముద్రించడం గొప్ప విషయమన్నారు. ఈ పుస్తకాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేసిన శ్రీనివాస్ రెడ్డి, రామరాజులకు భువన చంద్ర ధన్యవాదాలు తెలియచేశారు. ఆరోగ్యం సహకరించకపోయినా యండమూరి వీరేంద్రనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొని రచయితలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కామేశ్వరి, డాక్టర్ కేవీ కృష్ణకుమారి, డాక్టర్ తెన్నేటి సుధా దేవి, అత్తలూరి విజయలక్ష్మి,ముక్తేవి భారతి, పొత్తూరి విజయలక్ష్మి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వర్చువల్ సమావేశాన్ని డాక్టర్ వంశీ రామరాజు నిర్వహించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







