నేరాలు తగ్గుముఖం పట్టడంలో సీసీ కెమెరాలు
- March 10, 2016
నేరాలు తగ్గుముఖం పట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది కాలంలో హైదరాబాద్‌లో లక్ష కెమెరాలు ఏర్పాటే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమన్నారు. ఇప్పటికే నగరంలో 15వేల సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయినట్లు చెప్పారు.గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలతో పోల్చితే ఈ ఏడాది రెండు నెలల్లో 30 శాతం మేర నేరాలు తగ్గాయన్న ఆయన సీసీ కెమెరాలు విస్తృతంగా ఏర్పాటుచేయడమే దానికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. మెహిదీపట్నం నుంచి మల్లేపల్లి కూడలి వరకు ఏర్పాటుచేసిన 38 సీసీ కెమెరాలను, కమాండ్ కంట్రోల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ అంజనీకుమార్, డీసీపీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







