లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించిన సుప్రీం కమిటీ

- July 21, 2021 , by Maagulf
లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించిన సుప్రీం కమిటీ

ఒమన్: ఒమన్ వ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలును సుప్రీం కమిటీ చీఫ్ పరిశీలించారు. లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన ఆపరేషన్స్ సెంటర్ కు వెళ్లారు. అక్కడి నుంచే సంబంధిత అధికారులతో లాక్ డౌన్ పరిస్థితులను ఆరా తీశారు. ఈద్ వేళ సామూహిక ప్రార్ధనలు, బంధువుల రాకపోకలతో వైరస్ వ్యాప్తి చెందే ముప్పు ఉందనే ఉద్దేశంతో ఒమన్ వ్యాప్తంగా పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నవారికి, విదేశీ ప్రయాణికులకు, అత్యవసర వాహనాలు, వైద్య రంగ సిబ్బంది మాత్రమే లాక్ నుంచి మినహాయింపు ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com