ఖైదీలకు ఉపాధి శిక్షణ తరగతులు
- July 21, 2021
యూఏఈ: జైలుశిక్ష అంటే శిక్షించటం మాత్రమే కాదు. ఖైదీలో పశ్చాత్తాపం, పరివర్తన తీసుకురావటం. అదే జైలు జీవితం ఇతిసారం. యూఏఈలోని జైళ్ల శాఖ అదే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అబుధాబి జైలులో వివిధ నేరాల్లో శిక్షలు అనుభవిస్తున్న దాదాపు 1,400 మంది ఖైదీలకు ఉపాధి శిక్షణ తరగతులు చేపట్టింది.వివిధ వృత్తి, సాంకేతిక నైపుణ్య కోర్సులను నేర్పించినట్లు అధికారులు వెల్లడించారు.ఈ శిక్షణ తరగతులు వారి శిక్షా కాలం పూర్తై విడుదలయ్యాక ఉపాధి పొందేందుకు దోహదపడుతాయని తెలిపారు.ఇక గతేడాది 1,390 మంది ఖైదీలకు అనేక పునరావాసం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించిందని చెప్పారు. ఖురాన్ పఠనం, లేబర్ మార్కెట్, వ్యవస్థాపక, వృత్తి నైపుణ్య శిక్షణ తరగుతులు నిర్వహించినట్లు వివరించార. శిక్షాకాలం పూర్తైన తర్వాత శిక్షణ పొందిన ఖైదీల్లో 105 మంది లెబర్ మార్కెట్లో ఉపాధి పొందుతున్నారని అబుదాబి పోలీసులు తమ నివేదికలో తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







